క్రీడలు – Web Digital Way https://news.webdigitalway.com Wed, 16 Jul 2025 05:49:45 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=7.0.2 https://news.webdigitalway.com/wp-content/uploads/2026/06/cropped-Web-Digital-Way-1-32x32.png క్రీడలు – Web Digital Way https://news.webdigitalway.com 32 32 ఉత్కంఠ గా సాగుతున్న క్రికెట్ పోటీలు. https://news.webdigitalway.com/andhrapradesh/%e0%b0%89%e0%b0%a4%e0%b1%8d%e0%b0%95%e0%b0%82%e0%b0%a0-%e0%b0%97%e0%b0%be-%e0%b0%b8%e0%b0%be%e0%b0%97%e0%b1%81%e0%b0%a4%e0%b1%81%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8-%e0%b0%95%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf/ https://news.webdigitalway.com/andhrapradesh/%e0%b0%89%e0%b0%a4%e0%b1%8d%e0%b0%95%e0%b0%82%e0%b0%a0-%e0%b0%97%e0%b0%be-%e0%b0%b8%e0%b0%be%e0%b0%97%e0%b1%81%e0%b0%a4%e0%b1%81%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8-%e0%b0%95%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf/#respond Wed, 16 Jul 2025 05:49:45 +0000 https://news.webdigitalway.com/?p=1858 శతకం బాదిన ఫర్హాద్ ఖాద్రి. నాలుగు వికెట్లతో పాటు అర్థ సెంచరీ చేసిన ఆల్రౌండర్ జయకృష్ణ అనంతపురం బ్యూరో, టైమ్స్ న్యూస్: అనంతలో క్రికెట్ పోటీలు ఉత్కంటభరితంగా సాగుతున్నాయి. నువ్వా నేనా అన్న పోటీతత్వంతో క్రీడాకారులు తమ ప్రతిభను కనబరుస్తున్నారు. అనంతపురం నెల్లూరు మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్లు అధ్యంతం ఆసక్తి రేపుతున్నాయి. అనంతపురం నెల్లూరు ఏ సి ఏ సీనియర్ మెన్ మల్టీ డే ఇంటర్నెట్ డిస్ట్రిక్ట్ మ్యాచ్ లు క్రికెట్ అభిమానులకు కనువిందు చేస్తున్నాయి. […]

The post ఉత్కంఠ గా సాగుతున్న క్రికెట్ పోటీలు. appeared first on Web Digital Way.

]]>
శతకం బాదిన ఫర్హాద్ ఖాద్రి.

నాలుగు వికెట్లతో పాటు అర్థ సెంచరీ చేసిన ఆల్రౌండర్ జయకృష్ణ

అనంతపురం బ్యూరో, టైమ్స్ న్యూస్: అనంతలో క్రికెట్ పోటీలు ఉత్కంటభరితంగా సాగుతున్నాయి. నువ్వా నేనా అన్న పోటీతత్వంతో క్రీడాకారులు తమ ప్రతిభను కనబరుస్తున్నారు. అనంతపురం నెల్లూరు మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్లు అధ్యంతం ఆసక్తి రేపుతున్నాయి. అనంతపురం నెల్లూరు ఏ సి ఏ సీనియర్ మెన్ మల్టీ డే ఇంటర్నెట్ డిస్ట్రిక్ట్ మ్యాచ్ లు క్రికెట్ అభిమానులకు కనువిందు చేస్తున్నాయి.
తొలి ఇన్నింగ్స్ లో అనంత జట్టు ఆదిక్యం సాధించింది.
ఆల్ రౌండ్ జై కృష్ణ 50 పరుగులు సాధించి జట్టు ఆశలను సజీవం చేశారు. మరోవైపు సెంచరీ తో ఫర్హాద్ ఖాద్రి చెలరేగిపోయాడు.

ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనంతపురంలో జరుగుతున్న సీనియర్ మెన్ నాలుగో రౌండ్ మల్టీ డే క్రికెట్ పోటీల్లో అనంతపురం నెల్లూరు జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ ఆసక్తిని రేపుతోంది .ఈ పోటీల్లో విజేతగా నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో అనంతపురం జట్టు పోరాడుతుంది. తొలి ఇన్నింగ్స్ లో 237 పరుగులకు ఆల్ అవుట్ అయిన నెల్లూరుకు జవాబుగా అనంతపురం జట్టు కీలకమైన తొలి ఇన్నింగ్స్ ఆదిక్యం సాధించింది . తొలి ఇన్నింగ్స్ ఆదిక్యం సాధించడంలో అనంతపురం జట్టు ఆల్రౌండర్లు జై కృష్ణ ,బి ఎస్ వినయ్ కుమార్ కీలక పాత్ర పోషించారు. కష్టతరమైన బ్యాటింగ్ పరిస్థితుల్లో వీరిద్దరూ కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో జట్టు ఆశలు సజీవమయ్యాయి. అద్భుతమైన పోరాట ప్రతిభ కనబరిచిన జై కృష్ణ అర్థ సెంచరీ సాధించగా, జై కృష్ణకు మార్గ నిర్దేశం చేసిన కెప్టెన్ వినయ్ కుమార్ కీలకమైన నలభై పరుగులు సాధించాడు. సెలక్టర్లు, జట్టు కెప్టెన్ మరియు సీనియర్ సభ్యులు తన పై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్న జై కృష్ణ నాలుగు వికెట్లు తీయడమే కాకుండా కీలకమైన తొలి ఇన్నింగ్స్ లో ఆదిక్యం సాధించడంలో కీలక భూమిక పోషించి క్రికెట్ అభిమానుల అభిమానాన్ని పొందారు . తొలి ఇన్నింగ్స్ ఆదిక్యం కోల్పోయిన నెల్లూరు జట్టు తమ రెండో ఇన్నింగ్స్ లో వన్డే తరహా ఆట తీరును ప్రదర్శిస్తుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి కేవలం 53 ఓవర్లలో 245 పరుగులు చేసి ఐదు వికెట్లు కోల్పోయింది. జట్టు బ్యాట్స్మెన్ ఫర్హాద్ ఖాద్రి , రోషన్ పవన్ కుమార్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఫర్హాద్ ఖాదరి 118 బంతుల్లో 111 పరుగులు సాధించగా, రోషన్ పవన్ కుమార్ 104 బంతుల్లో 71 పరుగులు సాధించారు.
ఈ అంచె పోటీల్లో విజేతగా నిలవాలంటే అనంతపురం జట్టు ఈ మ్యాచ్ లో అవుట్రేట్ విజయం సాధించడంతోపాటు నెట్ రన్ రేట్ భారీగా పెంచుకోవలసి ఉంటుంది. నాలుగు మ్యాచ్ల్లు ఆడిన చిత్తూరు జట్టు 16 పాయింట్లు సాధించడం తోపాటు మెరుగైన రన్ రేట్ తో ప్రస్తుతం టాప్ పొజిషన్లో కొనసాగుతోంది. బుధవారం ఈ పోటీలకు ఆఖరి రోజు.

The post ఉత్కంఠ గా సాగుతున్న క్రికెట్ పోటీలు. appeared first on Web Digital Way.

]]>
https://news.webdigitalway.com/andhrapradesh/%e0%b0%89%e0%b0%a4%e0%b1%8d%e0%b0%95%e0%b0%82%e0%b0%a0-%e0%b0%97%e0%b0%be-%e0%b0%b8%e0%b0%be%e0%b0%97%e0%b1%81%e0%b0%a4%e0%b1%81%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8-%e0%b0%95%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf/feed/ 0
యోగ సాధన చేస్తే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది : డీఈవో శామ్యూల్ పాల్ https://news.webdigitalway.com/sports/%e0%b0%af%e0%b1%8b%e0%b0%97-%e0%b0%b8%e0%b0%be%e0%b0%a7%e0%b0%a8-%e0%b0%9a%e0%b1%87%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a4%e0%b1%87-%e0%b0%b8%e0%b0%82%e0%b0%aa%e0%b1%82%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a3-%e0%b0%86/ https://news.webdigitalway.com/sports/%e0%b0%af%e0%b1%8b%e0%b0%97-%e0%b0%b8%e0%b0%be%e0%b0%a7%e0%b0%a8-%e0%b0%9a%e0%b1%87%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a4%e0%b1%87-%e0%b0%b8%e0%b0%82%e0%b0%aa%e0%b1%82%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a3-%e0%b0%86/#respond Mon, 10 Feb 2025 03:24:38 +0000 https://news.webdigitalway.com/?p=1554 కర్నూలు : ప్రతి విద్యార్థి క్రమం తప్పకుండా యోగ సాధన చేస్తే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని కర్నూలు  జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్,రాష్ట్ర యోగ సంఘం చైర్మన్ లక్ష్మీకాంత్ రెడ్డి లు అన్నారు. ఆదివారం యోగ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో పెద్దపాడు లోని వేదాన్షి పాఠశాల నందు ఒకటవ రాష్ట్ర స్థాయి యోగ ప్రీమియర్ లీగ్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ మాట్లాడుతూ విద్యార్థుల్లో మానసిక […]

The post యోగ సాధన చేస్తే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది : డీఈవో శామ్యూల్ పాల్ appeared first on Web Digital Way.

]]>
కర్నూలు : ప్రతి విద్యార్థి క్రమం తప్పకుండా యోగ సాధన చేస్తే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని కర్నూలు  జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్,రాష్ట్ర యోగ సంఘం చైర్మన్ లక్ష్మీకాంత్ రెడ్డి లు అన్నారు. ఆదివారం యోగ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో పెద్దపాడు లోని వేదాన్షి పాఠశాల నందు ఒకటవ రాష్ట్ర స్థాయి యోగ ప్రీమియర్ లీగ్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ మాట్లాడుతూ విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ప్రతి ప్రభుత్వ పాఠశాలలో యోగా సాధన కోసం ప్రత్యేకంగా తరగతులను త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక చర్వతో ప్రపంచ వ్యాప్తంగా యోగా డే కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రపంచానికి ఆరోగ్య సంపదను అందిస్తున్నామని అన్నారు. అనంతరం యోగ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ చైర్మన్ లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో గత 13 సంవత్సరాల నుంచి యోగ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామన్నారు.ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా వందమందికి పైగా క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని రాణిస్తున్నారని అన్నారు. ఈనెల 13 నుంచి 16 వరకు కేరళలో జరగబోయే 49వ జాతీయస్థాయి పోటీల్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు పాల్గొని విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు. కల్లూరు ఏం.ఈ.ఓ శ్రీనివాసులు మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను యోగ సాధన వైపు ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. చదువుతోపాటు యోగాలో సాధన చేయిస్తే క్రమశిక్షణతో పాటు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యోగ సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్ శెట్టి, వేదాన్షి పాఠశాల కి రెస్పాండెంట్ పరమేష్, అనంతపూర్ జిల్లా యోగ సంఘం అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, జాతీయ యోగ సంఘం టెక్నికల్ అఫీషియల్స్ డాక్టర్ ముంతాజ్ బేగం,విజయ్ కుమార్,ఈశ్వర్ నాయుడు,జిల్లా సంఘం ప్రతినిధులు ఫయాజ్,పద్మలత, పోటీల నిర్వాహక అధ్యక్షుడు విద్యాసాగర్, వివిధ జిల్లాల నుంచి 200 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు.

The post యోగ సాధన చేస్తే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది : డీఈవో శామ్యూల్ పాల్ appeared first on Web Digital Way.

]]>
https://news.webdigitalway.com/sports/%e0%b0%af%e0%b1%8b%e0%b0%97-%e0%b0%b8%e0%b0%be%e0%b0%a7%e0%b0%a8-%e0%b0%9a%e0%b1%87%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a4%e0%b1%87-%e0%b0%b8%e0%b0%82%e0%b0%aa%e0%b1%82%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a3-%e0%b0%86/feed/ 0