Logo
Date of Publish : 10 June 2026, 8:48 am
Editor : Sake Naresh

బీసీల సమస్యలు, సంక్షేమంపై తెలంగాణ రక్షణ సేన కీలక సమావేశం

హైదరాబాద్, జూన్ 10: హైదరాబాద్‌లోని తెలంగాణ రక్షణ సేన కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షురాలు కవితమ్మ అధ్యక్షతన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ముఖ్య బీసీ నాయకులతో సమావేశం నిర్వహించారు. బీసీల సంక్షేమం, అభివృద్ధి, వారి హక్కుల పరిరక్షణకు సంబంధించి చేపట్టాల్సిన భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలో బీసీలకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. బీసీల హక్కుల సాధన కోసం తెలంగాణ రక్షణ సేన చేపట్టనున్న పోరాటాలు, ఉద్యమాలు, కార్యాచరణ ప్రణాళికలపై సమావేశంలో అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సమావేశానికి కరీంనగర్ జిల్లా నుంచి తెలంగాణ రక్షణ సేన జిల్లా బాధ్యులు గుంజపడుగు హరిప్రసాద్, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు అంకం శివరాణి, బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రీరాముల రమేష్, జిల్లా సీనియర్ నాయకులు రంగరవేణి లక్ష్మణ్, మనకొండూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి బుడిగె పరశురాం గౌడ్, జిల్లా నాయకులు బసవేణి రాజేందర్, గాలిపెల్లి రత్నాకర్ చారి, పసుల పవన్, కొరిమి పద్మ, నూనె చరణ్, విష్ణు తదితరులు హాజరయ్యారు. బీసీల అభ్యున్నతి కోసం తెలంగాణ రక్షణ సేన మరింత బలోపేతమైన కార్యాచరణతో ముందుకు సాగుతుందని సమావేశంలో నాయకులు స్పష్టం చేశారు.


All Rights Reserved By web Digital Way.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )